Post Views: 159
బోధన్, ఆగస్టు 22:వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గణేష్ మండపాల వద్ద తలెత్తే సమస్యల పరిష్కారానికి బోధన్ పట్టణ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పసువులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.వినతి పత్రంలో ప్రధానంగా సూచించిన అంశాలు:గణేష్ మండపాల వద్ద శుభ్రత, నాలాల పరిశుభ్రత నిర్వహణ ఎలక్ట్రిసిటీ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం.అన్నదానాలు జరిగే మండపాల వద్ద మంచినీటి సరఫరా, ఇస్తరాకులు తొలగింపు కోసం కార్మికులు, ట్రాక్టర్ ఏర్పాటుప్రతిరోజూ శుభ్రపరచి ముగ్గు వేయడంగుంతలను పూడ్చి రహదారులను సవరించడంవర్షపు నీరు చేరకుండా నాలాలను తరచుగా శుభ్రపరచడంఈ చర్యలను త్వరితగతిన అమలు చేస్తారని కమిషనర్ గారు హామీ ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దేవకట్టే శివరాజ్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, పెరిక వెంకటేష్, గుంత గంగాధర్, అడ్లూరి ఫణి, కలికోట కృష్ణ, నిమ్మ శ్రీనివాస్, లోసురే అనిల్, బిల్లా విజయ్, ఏనుగంటి గంగా సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








