Post Views: 59
దేవాలయ భూములు, ఆస్తులు, మాన్యాలు కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో వాటిని రక్షించేందుకు సర్వసమాజ్ మద్దతు అవసరమని దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఇందుకు సంబంధించి సమితి ఆధ్వర్యంలో సర్వసమాజ్ అధ్యక్షులకు వినతి పత్రం అందజేశారు.
సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ భూములు మరియు ఆస్తులను కాపాడడం కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇందూర్ నగరంలోని పెద్ద రామాలయ భూములు, కంటేశ్వర్ ఆలయానికి ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగింపు, శంభుని గుడి పరిసరాల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి అంశాల్లో పలు ప్రయత్నాలు చేశామని పేర్కొన్నారు.
అలాగే బోధన్ పట్టణంలోని వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం, రెంజల్ మండలంలోని కందకుర్తి రామాలయం భూములు సహా జిల్లాలోని అనేక దేవాలయాల భూములు, ఆస్తులు అక్రమంగా ఆక్రమించబడ్డాయని తెలిపారు. ఈ భూములను తిరిగి దేవాలయాల ఆధీనంలోకి తీసుకురావాలని, సర్వసమాజ్ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








