Post Views: 142
బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామానికి చెందిన మైనారిటీ సహోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిధుల బృందం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (DMWO) కృష్ణవేణి ని కలిసింది.
ఈ సందర్భంగా ప్రతినిధులు గౌరవ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు చేసిన సిఫార్సులను అధికారి దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మైనారిటీ వర్గానికి సంబంధించిన పథకాల అమలు, మౌలిక వసతుల సమస్యలు మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులకు వివరించారు.
అధికారి కృష్ణవేణి సమస్యలను సానుకూలంగా పరిగణించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ ప్రతినిధులు, స్థానిక మైనారిటీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








