Post Views: 147
బోధన్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష…
బోధన్, ఆగస్టు 21:
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు బోధన్ సబ్ కలెక్టర్ , తహసీల్దార్ బోధన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)లతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు.
సబ్ కలెక్టర్. గణేష్ నిమజ్జన రూట్లను పరిశీలించి, భక్తులు సాఫీగా మరియు సురక్షితంగా నిమజ్జనం చేయగల విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పసుపు వాగు, శక్కర్‌నగర్‌లోని గణేష్ బావి వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా శక్కర్‌నగర్ ట్యాంక్, బి.టి.నగర్ ట్యాంక్ ప్రాంతాలను కూడా సందర్శించి, భద్రతా చర్యలు, శుభ్రత, రాబోయే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
అధికారులు ప్రజల సౌకర్యం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....











