Post Views: 148
ఎడపల్లి మండలం:అక్రమ ఇసుక రవాణాపై ఎడపల్లి పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. బుధవారం సాయంత్రం ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తన సిబ్బందితో కలిసి భారీ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఆరు వాహనాలు (ఐదు ఆటోలు, ఒక బొలెరో) పట్టుబడ్డాయి..
సాలూర మండలం, హుంసా, ఖాజాపూర్, మందర్న గ్రామాల నుంచి బోధన్ – నిజామాబాద్ వైపు ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమ రవాణాపై కేసులు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్సై ముత్యాల రమ మాట్లాడుతూ –
“అక్రమంగా ఇసుక తరలించే వారికి ఉపేక్ష ఉండదు. వాహనాలు స్వాధీనం చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
స్థానికులు చెబుతున్నదేమిటంటే, ఈ ఇసుక ఆటోలకు నంబర్ ప్లేట్లు ఉండవు, డ్రైవర్లకు గుర్తింపు బ్యాడ్జీలు ఉండవు, అదీగాక అధిక లోడుతో అధిక స్పీడ్లో రవాణా చేస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన నిఘా పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరి పట్టుబడ్డ వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..!సాలూర మండలం, హుంసా,.!
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









