V1News Telangana

best news portal development company in india

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

SHARE:

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఆగస్టు 20:-

రామగుండం ఏరియాలో  నేరాలాకి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ…. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాని రామగుండం కమిషనరేట్‌ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వ్రేలిముద్రలతో ఇతర సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్‌ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.ఈ కార్యక్రమములో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, ఏ ఓ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ. రాము, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ మంచిర్యాల్, ఇన్స్పెక్టర్ లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, ఆర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిసి హరీష్ తో ఇతర పోలీస్‌, క్లూస్ టీమ్, RFSL సిబ్బంది పాల్గొన్నారు.

NAMANI RAKESH
Author: NAMANI RAKESH

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india