Post Views: 108
నంబర్ ప్లేట్లు లేని ట్రాలీ ఆటోలు.. అనుమతులు లేని రవాణా.. ఎవరికి లాభం?
మంజీరా నుంచి ఇసుక దోపిడీ.. ప్రజల కేకలు వినని అధికారులు!
. అక్రమ ఇసుక రవాణా బహిరంగంగానే.. కానీ చర్యలు మాత్రం జీరో..

బోధన్ పట్టణం పరిధి నుంచి మండలంలోని గ్రామాలకు రోజూ ట్రాలీ ఆటోలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూనే ఉంది. అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రగల్చుతోంది.

మందర్నా మంజీరా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ట్రాలీ ఆటోల ద్వారా తరలిస్తుంటే ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది. ఈ ట్రాలీలకు బ్యాచ్ నెంబర్లు లేవు, నంబర్ ప్లేట్లు లేవు, లేవు.
“ఉదయం నుంచి రాత్రి వరకూ నంబర్ ప్లేట్ల లేని ఆటోలు బహిరంగంగానే ఇసుకను తరలిస్తున్నాయి. వీరి వెనుక ఎవరి ఆశీర్వాదం ఉందో? ఎవరికి లాభం చేకూరుతోందో?” అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మామూలు వసూళ్లకే అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








