Post Views: 186
వర్షాలతో ఇబ్బందులు.. డ్రైనేజీ, శానిటేషన్‌పై ప్రజల ఆందోళన.
. వినాయక చవితి, మిలాదునబి పండుగల ముందు పరిసరాలు శుభ్రం చేయాలని డిమాండ్..
. కొత్త కమిషనర్‌కి సన్మానం చేసిన BRS నాయకులు…
బోధన్, ఆగస్టు 19:
ఈరోజు బోధన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ గారిని కలసి BRS నాయకులు వినతిపత్రం సమర్పించారు. వర్షాల కారణంగా పట్టణంలో 38 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 35వ, 12వ వార్డులలో రోడ్ల పై గుంతలు పూడ్చాలని, డ్రైనేజీలను శుభ్రం చేయాలని, ఇండ్ల మధ్య నిలిచిన నీటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
వర్షపు నీరు నిల్వ ఉండడం వలన దోమల పెరుగుదలతో పాటు విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల వద్ద పరిసరాలు శుభ్రం చేసి, వీధి దీపాలను మరమ్మతు చేసి కొత్తవిగా బిగించాలని కోరారు. అదేవిధంగా మిలాదునబి పండగ సందర్భంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించే కారణంగా రహదారులు, ఆశ్రయాల వద్ద డస్ట్, మోరంను వేయాలని కోరారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను నాయకులు కోరారు. అనంతరం కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ కృష్ణ జాదవ్ గారిని BRS నాయకులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా SC.ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెరక రామకృష్ణ, BRS కార్మిక విభాగం అధ్యక్షుడు నాగుల రవిశంకర్ గౌడ్, శంకర్, అబ్దుల్ రహీం అత్తారి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








