– నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన సీనియర్ నాయకులు మార్కెళి ప్రకాష్ పటేల్
– మార్ప బసవేశ్వర్ గారి ఆశయాలను నెరవేర్చే విధంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ
– వీరశైవ లింగాయత్ నూతన కమిటీ అధ్యక్షులు ఎం . శివకుమార్ పటేల్
పొతంగల్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా : పొతంగల్ మండల కేంద్రంలో మంగళవారం రోజు పొతంగల్ గ్రామ వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీకి అధ్యక్షునిగా ఎం. శివకుమార్ పటేల్ ను నియమించారు. ఉపాధ్యక్షునిగా మూలే నాగేంద్ర పటేల్ , ప్రధాన కార్యదర్శిగా జంగం దత్తు మహారాజ్, కోశాధికారిగా కన్నా లక్ష్మణ్ పటేల్ (TV ), సహాయ కార్యదర్శిగా మారుతి పటేల్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సీనియర్ నాయకులు మార్కెలే ప్రకాష్ పటేల్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా వీరశైవ లింగాయత్ సమాజ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు ఎం. శివకుమార్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వీరశైవ సమాజ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యక్షుడిగా నాపై బాధ్యతలు మరింత పెరిగాయని.. తనకు అప్పగించిన బాధ్యతలను వీరశైవ లింగాయత్ ల ఆరాధ్య గురువు మార్ప బసవేశ్వర్ గారి ఆశయాలను నెరవేర్చే దిశగా అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేసి సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శాంతిశ్వర్ పటేల్, కుశాల్ పటేల్, డిగంబర్ పటేల్, ప్రకాష్ పటేల్, విశ్వంబర్ పటేల్, నితిన్ పటేల్, రాజ్ కుమార్ పటేల్, సంతోష్ పటేల్, శివ కుమార్ పటేల్, సంజు పటేల్, ఓమన్న పటేల్ మరియు వీరశైవసమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








