Post Views: 167
గ్రామస్థులకు ధైర్యం నింపిన సాలుర తహసీల్దార్..
. మంధర్నా గ్రామంలో ప్రజలతో కలిసి రాత్రి గడిపిన శశిభూషణ్..
. ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ…
. వానలోనే గ్రామానికి చేరుకుని ప్రజలతో భజనలో పాల్గొన్న తహసీల్దార్.
సాలుర, ఆగస్టు 19:
నిన్న రాత్రి వరద ముంపు ప్రభావిత మంధర్నా గ్రామంలో సాలుర మండల తహసీల్దార్ శ్రీ శశిభూషణ్. రాత్రి మొత్తం గ్రామస్థులతో కలసి గడిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను ధైర్యపరచడం జరిగింది. వర్షంలోనూ గ్రామానికి చేరుకున్న ఆయన, గ్రామ ప్రజలతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొని, వారికి ఆత్మస్థైర్యం కలిగించారు.

గ్రామస్థులకు వరద జాగ్రత్తలు తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. “ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంది” అని తహసీల్దార్ ప్రజలకు భరోసా కల్పించారు.
సాలూర మండల గ్రామ ప్రజలు ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ – “రాత్రి వానలో కూడా మాతో గడిపి ధైర్యం ఇచ్చిన తహసీల్దార్ కు కృతజ్ఞతలు” తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









