V1News Telangana

best news portal development company in india

భైంసాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా…

SHARE:

జనసేన ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

. ప్రజలకు ఆదర్శం సర్దార్ పాపన్న గౌడ్ – జనసేన నేత సుంకేట మహేష్ బాబు

. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీసీ, రజక, బామ్ సేఫ్ సంఘాల నేతల శ్రద్ధాంజలి…

భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం వద్ద బీసీ సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు.
జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకుడు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ, నిజాం పాలనలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి గోల్కొండ కోటను తన సామ్రాజ్యంగా చేసుకొని ప్రజలకు రక్షణ కవచంలా నిలిచిన మహనీయుడు పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకుడు సుంకేట పోశెట్టి, బామ్ సేఫ్ జిల్లా నాయకుడు అనిల్, రజక సంఘం నాయకులు శ్రీను, ముత్యం, సాయినాథ్, భూమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india