Post Views: 84
పాత బ్రిడ్జి మునిగిపోగా – ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక..
. వరద ప్రభావం తీవ్రం – గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మండల రెవెన్యూ అధికారి వై.శశిభూషణ్. సూచన…పాత బ్రిడ్జి మునిగిపోగా – ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక..
. వరద ప్రభావం తీవ్రం – గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మండల రెవెన్యూ అధికారి వై.శశిభూషణ్. సూచన…

నిజామాబాద్ జిల్లా సాలూర మండల శివారులో మంజీరా నదికి భారీగా వరద పోటెత్తింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేయడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిజాం కాలం నాటి పాత బ్రిడ్జి నీటమునిగింది.
ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి వై.శశిభూషణ్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లరాదని, పాత ఇండ్లు కూలిపోవచ్చని అనుమానం ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని సూచించారు.
అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలు, మోటార్ల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ, రెవెన్యూ సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారుల సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








