పారిశుద్ధ్య సిబ్బంది భద్రతపై సూచనలు రైన్ కోట్లు పంపిణీ

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఆగస్టు 18:-
పారిశుద్ధ్య సిబ్బంది ప్రమాదాలు, అనారోగ్యం నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్ కమిషనర్ (ఎఫ్‌ఎసి) జె. అరుణశ్రీ సూచించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్‌కోట్లు పంపిణీ చేసి, వ్యక్తిగత రక్షణ కిట్లు మరియు రెయిన్‌కోట్లు తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా మన్నికైన రెయిన్‌కోట్లు అందించామని పేర్కొన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, డీఈ శాంతి స్వరూప్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Author: NAMANI RAKESH
STAFF REPORTER RAMAGUNDAM








