Post Views: 59
సాలూర 18, ఆగష్టు (వి1 న్యూస్) : శ్రావణమాసం పురస్కరించుకుని సాలూర మండలం మందర్న, హున్స, ఖాజాపూర్ గ్రామాల భక్తులు బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర ఆలయానికి కాలినడకన సోమవారం బయలుదేరారు. ఈ సందర్భంగా హున్సా ప్రాథమిక పరపతి సంఘం అద్యక్షుడు మందర్న రవి సాలూర క్యాంప్ గ్రామం వద్ద కాలినడకన వెళ్లే భక్తులకు తన వంతుగా భక్తిగా పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… మందర్న గ్రామ కాశి విశ్వనాథ ఆలయం నుంచి భక్తులు ప్రతి సంవత్సరం బోధన్ పట్టణం లోని శివాలయం వరకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఆ శివుని అనుగ్రహం వల్ల ప్రజలు సుకశాంతోషాలు, పాడి పంటలుతో ఎల్లవేళలా అందరు బాగుండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుదు ఇల్తెపు శంకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832








