Post Views: 141
బోధన్ రూరల్, ఆగస్టు 18 (V1):
సాలూర మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాలూర గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు లక్ష్మ గౌడ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మొగల్ సామ్రాజ్యంపై పోరాడిన గొప్ప వీరుడని, బడుగు బలహీన వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి సమానత్వానికి కృషి చేశారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కల్లు గీత కార్మిక అధ్యక్షుడు. లక్ష్మ గౌడ్, గీత కార్మిక సంఘ సభ్యులు. స్వామి గౌడ్, గోవింద్ గౌడ్, మొగుల గౌడ్, సందీప్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









