V1News Telangana

best news portal development company in india

ఇసుక డంపులపై చర్యలేమీ లేవా..? . బడా బాబుల చెంత ఇసుక మాఫియా – అధికారులు మూగబోయారా..? . పోలీసులు–రెవెన్యూ అధికారులు నిద్రపోతే… ఇసుక ట్రాక్టర్లు రయ్య మంటూ దూసుకెళ్తున్నాయి! . ఇసుక స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ – ఇంద్రమ్మ ఇళ్లకు వెళ్లాల్సిన ఇసుక బ్లాక్ మార్కెట్ బలి. . మిడ్‌నైట్ స్మగ్లర్లకు ఫ్రీ పాస్ – అధికారులపై ప్రజల అనుమానాలు!..

SHARE:

.నిజామాబాద్ జిల్లా బోధన్, కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండగమ్, సాలూరా మండలాలు ఇసుక మాఫియాకు అడ్డాగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుకను అందించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు మిడ్‌నైట్ స్మగ్లర్లు డంపులు ఏర్పాటుచేసుకొని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లు పెడుతున్నారు.
శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో అధికారులు మునిగిపోయిన సమయంలోనే స్మగ్లర్లు ఇసుక రవాణాకు రెడ్ కార్పెట్ వేశారు. ఎడపల్లి, సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నుంచే రయ్య మంటూ ఇసుక ఆటోలు. ట్రాక్టర్లు, టిప్పర్లు. దూసుకెళ్తున్నా, పోలీసులు మూగబోయినట్లే? వ్యవహరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే ఈ అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక వాహనాలను ఆపే బదులు, ఎవరు గట్టిగా ప్రశ్నిస్తే వారిపైనే కేసులు, ధర్నాలు, బెదిరింపులు చేస్తున్న స్మగ్లర్లు బలపడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీసులు మాత్రమే కాకుండా మైనింగ్, ఆర్టీఏ అధికారులు కూడా పూర్తిగా గల్లంతైనట్టే. “వీరికి సకాలంలో మాములు అందుతుందంటూ” ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రశ్న ఒకటే – అధికారులు ఇసుక మాఫియాకు అమ్ముడు పోయారా..? లేక భయపడి మూగబోయారా..?
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india