Post Views: 201
బోధన్ మండలంలోని హంగర్గా గ్రామంలో ఈ రోజు కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో స్థానిక అధికారులు గ్రామాన్ని సందర్శించారు.
తహసీల్దార్ విఠల్ గారు, ఎంపీడీఓ మధుకర్ గారు, వ్యవసాయ అధికారి సంతోష్ గారు, ఏఈఓ ముజామిల్ గారు గ్రామానికి చేరుకొని వర్షాల కారణంగా నిరువచ్చే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి జహీర్ గారు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








