– జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం నిర్వహణ
– జిల్లా ఉత్తమ జూనియర్ అసిస్టెంట్ అవార్డు అందుకున్న అబ్దుల్ రజాక్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దుల్ రజాక్ శుక్రవారం రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తాను అందించిన సేవలకు గాను “ఉత్తమ సేవా పురస్కారం” అందుకున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి, ఎస్పి రాజేష్ చంద్ర లతో కలిసి అవార్డును అందజేశారు. జిల్లా ఉత్తమ సేవా పురస్కారం లభించడం చాలా సంతోషకరమని అబ్దుల్ రజాక్ అన్నారు. అవార్డు పొందడం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరింత అంకితభావంతో విధులు నిర్వహించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ అవార్డును తన ప్రాణ సమానుడైన ఆయన అన్నయ్య దివంగత సయ్యద్ నసీబ్ కు అంకితం ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపల్ అసద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








