V1News Telangana

best news portal development company in india

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

SHARE:

 

 

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ సలహాదారులు

– నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రోజు బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు , బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అశోక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india