Post Views: 68
బోధన్ టౌన్ , ఆగస్టు 15 , v1
బోధన్ తట్టికోట గల్లి లో రెడ్డికా సంఘం నందు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీజీ ఫోటోకు పూలమాలవేసి, జాతీయ జెండా ఎగరవేశారు. విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు . అనంతరం రెడ్డికా సంఘం అధ్యక్షులు గుంత గంగాధర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని , పిల్లలు చక్కగా చదువుకుంటూ దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు . స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనం ఎల్లవేళలా స్మరించుకోవాలని, నేడు భారతదేశ అభివృద్ధి పదంలో ఉండటానికి నాటి స్వతంత్ర సమరయోధులు పోరాట ఫలితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డికా సంఘం అధ్యక్షులు గుంత గంగాధర్ , ప్రధాన కార్యదర్శి ఆరుగొండ లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు సూర లింగం , కార్యదర్శి అరుగొండ రవి , ప్రచార కార్యదర్శి శీలా లక్ష్మణ్ , పెద్దలు సూర లింగారెడ్డి , ఆరుకొండ శంకర్ , దేవ సాయిలు , దేవ శంకర్ , శీల రవి , తరప పెద్దలు, ఉపాధ్యాయిని లలిత , విద్యార్థిని , విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








