Post Views: 58
బోధన్ రూరల్ , ఆగస్టు 15 v1 ,
బోధన్ మండలం అమ్దపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల నుండి విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు జాతీయ జెండాలు పట్టుకుని పెరేడ్ నిర్వహించి, ర్యాలీ ద్వారా జై జవాన్,జై కిసాన్ నినాదాలు చేస్తూ గ్రామపంచాయతీ వరకు వచ్చి గ్రామపంచాయతీ ప్రాంగణంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రంజిత్ సింగ్ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సూర్య కుమార్ గాంధీజీ ఫోటోకు పూలమాలవేసి ,కొబ్బరికాయ కొట్టి అనంతరం జాతీయ గీతం ఆలపించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోట్లాడి, తమ ప్రాణాలను అర్పించారని,కావున నేటి యువత చక్కగా చదువుకుంటూ మహానుభావుల అడుగుజాడలలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సూర్య కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సునీత, శ్రీనివాస్, రాము, సత్యం, ప్రకాష్, సరళ మరియు గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి , బిజెపి బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, కాలేవార్ కృష్ణ , విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








