Post Views: 144
నాగన్‌పల్లి మహాలక్ష్మి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన – భక్తుల సందడి మధ్య ఘనత
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్‌పల్లి గ్రామంలోని మహాలక్ష్మి మందిరంలో ఈ రోజు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు..

ఈ కార్యక్రమాన్ని మహాలక్ష్మి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు బేగరి సాయిరెడ్డి, ఉపాధ్యక్షుడు డొక్క గంగాధర్, ప్రధాన కార్యదర్శి మంత్రి రవి, సభ్యులు కొండపల్లి శంకర్, మంత్రి సాయిలు, మంత్రి నరేష్, బేగరి కార్తీక్, బేగరి మధు, కొండపల్లి నరేష్, గంధం చిన్న గంగాధర్, మచ్కురి సురేష్, మచ్కురి విట్టల్ తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.
విగ్రహ దాత ఇంద్ర షేనా రెడ్డి, ఆలయ అభివృద్ధి దాతలు హత్కరి హనుమంతు, బోల్లేపల్లి శ్రీకాంత్, పంతులు రాజు తదితరులు ఈ కార్యక్రమంలో విశేషంగా సహకరించారు.
ప్రతిష్టాపన సందర్భంగా గ్రామమంతా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, వేడుక ఉత్సాహంగా ముగిసింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









