Post Views: 323
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు కౌంట్‌డౌన్ మొదలైంది. బీసీ రిజర్వేషన్ సమస్య ఇంకా తేలకపోయినా, హైకోర్టు విధించిన గడువు మేరకు ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే వారం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.
చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాకపోవడంతో, పాత రిజర్వేషన్లను కొనసాగిస్తూ, పార్టీపరంగా బీసీలకు మరిన్ని స్థానాలు దక్కేలా వ్యూహం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులు, 12,778 పంచాయతీలు, 1,12,934 వార్డుల వివరాలు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది.
ముందుగా పరిషత్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్లను కూడా సిబ్బంది, వార్డు వారీ వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.అయితే, సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు ఇచ్చిన గడువులోగా ఎన్నికలు పూర్తి చేయలేకపోతే, గడువు పొడిగించమని ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్ అమలులో ఉండగా, ఆ స్థానాలతో పాటు సాధారణ స్థానాల్లోనూ బీసీలు అధికంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే తరహా వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








