V1News Telangana

best news portal development company in india

కేసీఆర్ జైలుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఫామ్‌హౌజ్‌నే జైలు చేసుకున్నారు!” – సీఎం రేవంత్ రెడ్డి…

SHARE:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో సమావేశమైన సందర్భంగా, కేసీఆర్ వ్యవహారశైలిపై సెటైరికల్ కామెంట్లు చేస్తూ, “కేసీఆర్‌ను నేనేందుకు జైల్లో వేస్తా? ఆయనకు ఆయనే ఫామ్‌హౌజ్‌లో బందీ అయ్యారు” అని ఎద్దేవా చేశారు.

 

చర్లపల్లి జైలుకి, ఫామ్‌హౌజ్‌కి పెద్ద తేడా లేదు. అక్కడ పహారా ఉంటుంది, ఇక్కడ పర్యవేక్షణ ఉంటుంది అంతే!” అంటూ కేసీఆర్ గృహనిర్బంధాన్ని రాజకీయంగా కవ్వించేందుకే ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు తిరిగి అధికారం అందిస్తారని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, “మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అధికారం కోసం ఇతరుల ఇంట్లోకి వేళ్లుపెట్టడం అవసరం లేదు” అంటూ బీఆర్ఎస్ పార్టీకి చురకలంటించారు.
ఇక, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి జరగవచ్చన్న అభిప్రాయాన్ని కూడా రేవంత్ వెల్లడించారు.
ఈ సందర్బంగా బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india