హైదరాబాద్, ఆగస్ట్ 07:
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. వారికి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో మూడు రోజుల పాటు.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి.
ఆగస్ట్ 8వ తేదీ శ్రావణ శుక్రవారం, ఆప్షన్ హాలిడే ఆగస్ట్ 9వ తేదీ రాఖీ పౌర్ణమి. అదీకాక ఆ రోజు రెండో శనివారం కూడా. ఇక ఆగస్ట్ 10 వ తేదీ ఆదివారం. దీంతో బడులు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు.అయితే వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో.. దూర ప్రాంతాల్లో ఉండి హాస్టల్లో చదువుకుంటున్న హాస్టల్ విద్యార్థులతో పలు బస్ స్టాండ్లు రద్దీగా మారాయి.
మరోవైపు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు సైతం సెలవు దినమే. ఆగస్ట్ 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి దీంతో శనివారం సెలవు వచ్చింది. ఇక ఆగస్ట్ 17వ తేదీ ఆదివారం. దీంతో ఈ వారంతోపాటు వచ్చే వారంలో సైతం శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. ఆ రోజుల్లో సైతం తమ పిల్లలతో టూర్లు వెళ్లేందుకు తల్లిదండ్రులు సమాయత్త మవుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








