V1News Telangana

best news portal development company in india

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు….

SHARE:

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు సమీకృత మండల భవన సముదాయం ప్రాంగణంలో ఎస్ డి ఎఫ్ నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనులను ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మించాలని గుత్తేదారుకు సూచించారు. వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, తహసిల్దార్ సువర్ణ, ఉపతహసిల్దార్ బావయ్య, దంతూరి మైషాగౌడ్, ఖలీల్, చుంచు సాయిలు, మామిడి భూమయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india