నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సమీకృత మండల సముదాయం భవనంలో బుధవారం రోజు తహసిల్దార్ సువర్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 92 వ జయంతిని నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహాసిల్దార్ సువర్ణ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మంచి ప్రావీణ్యం కలిగి తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని కొనియాడారు.1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ – ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మలిదశ ఉద్యమంలో నాయకులను, అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటే ఉండి నడిపించారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యతపై పలు పుస్తకాలు రచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసిల్దార్ బావయ్య, ఆర్ ఐ వెంకటేష్, ఏపీవో సౌజన్య , శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








