V1News Telangana

best news portal development company in india

బోధన్ పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు: నెల రోజుల పాటు కెనాల్ రోడ్ పనులు

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 6
బోధన్ పట్టణంలోని అనిల్ డీలక్స్ రోడ్ లోని చౌరస్తా దగ్గర కెనాల్ రోడ్డుపై రిపేర్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రాఫిక్ సీఐ గారు తెలిపిన ప్రకారం, రిపేర్ పనులు పూర్తి అయ్యే వరకు అంటే సుమారు నెల రోజుల పాటు, భారీ వాహనాలు, బస్సులు, కార్లు తదితర రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాల్సి ఉంటుంది. బోధన్ బైపాస్‌లోని రవి గార్డెన్ నుండి, నిజామాబాద్ బైపాస్ మార్గంగా కొత్త బస్టాండ్ వైపు తిరిగి రావాలని సూచించారు.
ఈ మార్గంలో దారి మలుపులు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఆచితూచి నడవాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజలు, డ్రైవర్లు సహకరించాలని, తద్వారా ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india