జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పై జిల్లా స్థాయి సమన్వయ మరియు శిక్షణ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం ఆగష్టు 11 వ తేదీన జిల్లా వ్యాప్తంగా 1 -19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు అల్బెన్దజోల్ మాత్రలు వేయడం జరుగుతుంది అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. రాజశ్రీ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో, సోషల్ వెల్ఫేర్ , బి.సి వెల్ఫేర్ , మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, కళాశాలల్లో మరియు హాస్టల్స్లో, మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలల్లో ఈ అల్బెన్దజోల్ మాత్రలు అందించబడుతుంది అని తెలియ జేశారు. అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఈరోజు జిల్లాలోని అందరు ప్రోగ్రాం ఆఫీసర్స్ కు , మెడికల్ ఆఫీసర్స్ కు, మండల విద్య శాఖ అధికారులకు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు మరియు మదర్సా సభ్యులకు నులిపురుగులు నివారణకు చేపట్టవలసిన చర్యలకి సంబందించి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని మరియు సమన్వయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.అన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు మరియు మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలల్లో కూడా ఈ అల్బెన్దజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలియజేసారు. అల్బెన్దజోల్ మాత్రలు పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఈ మాత్రలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి మంచిదని, ఈ మాత్ర వల్ల నులిపురుగులను నిర్మూలించి పోషకాహార లోపాలని అరికట్టవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు తెలియజేసారుఎవరైనా పిల్లలు అనారోగ్యం కారణంగా కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల ఐన అల్బెన్దజోల్ మాత్రలు ఆగష్టు 11 వ తారీఖున నమిలి చప్పరించి తీసుకోవాలన్నారు వేసుకోనట్టయితే మలి విడుత నాడు అనగా ఆగష్టు 18 వ తారీఖున తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, విద్యాశాఖ అకాడమిక్ మానిటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి సిడిపిఓ సౌందర్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత,ఆర్.బి. స్.కె మేనేజర్ సచిన్, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు,ఎంఈవోలు సిడిపివోలు పాల్గొన్నారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








