V1News Telangana

best news portal development company in india

తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం లయన్స్ క్లబ్ బోధన్ ఆధ్వర్యంలో మాతృ స్మరణా వారోత్సవం

SHARE:

బోధన్, ఆగస్టు 6:
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బోధన్ లోని లయన్స్ ఐ హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం నాడు “అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం” అనే థీమ్‌తో మాతృ దినోత్సవ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్ PDG వి.లక్ష్మి గారు, సిడిపిఓ పద్మ గారు, లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF) గారు, అధ్యక్షులు లయన్ ఎం.గోవింద్ రెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమ్మరి పోశెట్టి గారు, కోశాధికారి లయన్ కంచోజీ సత్యనారాయణ గారు, లయన్స్మెంబర్లు జి.గంగారెడ్డి, అంతోని మేరీ, జి.పద్మ, రాఘవరాణి, పీడీ రసూల్ బి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య రంగం నుండి డాక్టర్ దీపక్, డాక్టర్ సమత (అడిషనల్ DMHO), డాక్టర్ ముదిపల్లి నందిని, డాక్టర్ రాధిక, శ్రీలత (సూపర్వైజర్), రాంబాబు (డిస్టిక్ట్ కోఆర్డినేటర్) కూడా ఈ కార్యక్రమానికి హాజరై, తల్లిపాల యొక్క ప్రాధాన్యతపై విలువైన సమాచారాన్ని అందించారు.
ప్రోగ్రాం చైర్మన్ గా లయన్ PDG వి.లక్ష్మి గారు, కో చైర్మన్ గా లయన్ ఎస్.ఆంతోని మేరీ గారు వ్యవహరించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మరియు తల్లులలో తల్లిపాల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తూ జ్ఞానవృద్ధి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india