*గ్రామీణ వైద్యులుగా తమకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించి, నిర్దిష్ట పరిధిలో వైద్య సేవలు అందించే అధికారం ఇవ్వాలని ఆర్ఎంపి మరియు పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని తమ ఆవేదన*
ఇటీవల కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలం, శాంతాపూర్ గ్రామంలో పీఎంపీ వైద్యుడు దినేష్ పైన మండల వైద్య అధికారి దాడిని కామారెడ్డి జిల్లా పి.ఎం.పి మరియు ఆర్ఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు…
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పి ఎం పి ఆర్ ఎం పి అసోసియేషన్ జిల్లా అధికార ప్రతినిధి భీమ్రాజ్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న పీ ఎం పీ మరియు ఆర్ ఎం పి వైద్యులపై రాష్ట్ర వైద్య మండలి నిర్వహిస్తున్న దాడులను వెంటనే ఆపాలని, శాంతాపూర్ ఆర్ ఎం పి వైద్యుడుపై ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని…
కార్పొరేటర్స్ స్థాయి వైద్యం అందిస్తామంటూ ప్రజలను మోసం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న ఆస్పత్రి యాజమాన్ నే పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. తమకు సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని దీనివల్ల గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తన ఆందోళనను వ్యక్తం చేశారు…
*పిఎంపి,ఆర్ఎంపీ వ్యవస్థపై ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం…*
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వ వైద్యులు లేకపోవడం వల్ల, తామే ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నామని, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా ఉంటున్నామని, ఎక్కడో చిన్నపాటి సమస్య వస్తే దానికి కారణం మొత్తం ఆర్ఎంపీ పిఏఎంపి వ్యవస్థను దూషించడం సరికాదని, ప్రభుత్వం తరఫు నుండి దాడులను వెంటనే ఆపాలని కామారెడ్డి జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిజ్జన విటల్ కోరారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








