Post Views: 301
– ఎస్సై సునీల్ ప్రవర్తన పట్ల బోధన్ ఏసిపి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు…
– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ…
నిజామాబాద్ జిల్లా: బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ (బాధితులు) పట్ల. కోటగిరి ఎస్సై సునీల్ తీరును ఖండిస్తూ సోమవారం రోజు బిజెపి నాయకులు ఏసిపి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజు “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో కోటగిరి మండల కేంద్రంలో గల ఓ హెయిర్ కటింగ్ సెలూన్ షాపులో కటింగ్ చేయించుకుందామని వెళ్లానని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ తెలిపారు. అదే సమయంలో కోటగిరి ఎస్సై సునీల్ ఆ షాపులో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారని.. ఆ సందర్భంలో ఎస్సై తనతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారని ఆరోపించారు. తాను భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షున్ని అని తెలిపినప్పటికి కూడా నువ్వు బిజెపి అధ్యక్షుడు అయితే నేను భయపడాలా నువ్వు ముందు బయటకి వెళ్లి మాట్లాడు అని తనని హెచ్చరించారని తెలిపారు. SI ఆ సమయంలో షాపులో నుండి కోపంగా బయటకి వెళ్ళిపో అని హరికృష్ణను కోపగించుకున్నా అక్కడి నుండి తాను వెళ్లలేదని తెలిపాడు.
ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని అప్పుడే పదిమంది కానిస్టేబుల్ లను పిలిపించి తనకు కటింగ్ చేయొద్దని షాప్ బంద్ చేయండి అని సెలూన్ షాప్ యజమానికి ఆదేశించి వెళ్ళిపోయాడని తెలియజేశారు. నేను బిజెపి మండల అధ్యక్షుడు అని చెప్పిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా తనను ఇలా ఇబ్బందికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి నాయకుల పట్ల బాధ్యత గల పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఇంకెలా ఉందో అని ఆవేదన వ్యక్తం చేశారు.అందువలన ఎస్సై సునీల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రోజు బోధన్ ఏసీపీ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....










