Post Views: 89
బోధన్, ఆగస్టు 4 (ప్రత్యేక ప్రతినిధి):
శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా బోధన్ శివారులోని బెల్లాల్ చెరువు ఆయకట్టున వెలసిన పవిత్ర పాప నాగమ్మ తల్లికి గంగపుత్రుల ఆధ్వర్యంలో బోనాలతో ఊరేగింపు జరిపారు. తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఊరేగింపుతో ప్రారంభమై, అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు.
కుమ్మర్ గల్లీ నాలుగు తర్పల నుంచి ప్రారంభమైన బోనాల పాదయాత్రలో డప్పు వాయిద్యాలు, హారతులతో గంగపుత్రులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో సహా వందలాది భక్తులు పాల్గొన్నారు. శ్రద్ధాభక్తులతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ, ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి తిప్పోత్సవం జరిపారు.
గంగపుత్రులు తెలిపారు బెల్లాల్ చెరువు నీరు బోధన్ ప్రజలకి ప్రధాన త్రాగునీటి మూలంగా ఉండి, దీన్ని తాగితే శరీరానికి కీళ్లనొప్పులు వంటి వ్యాధులు దూరమవుతాయని ప్రజల విశ్వాసం ఉంది. వందలాది సంవత్సరాలుగా ఈ పండుగను ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తోందని చెప్పారు.
- ఈ సందర్భంగా నల్లగల్లు మైసమ్మ తల్లికి మేకల బలి ఇచ్చే ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా జరిగింది. చేపల వేటకి ముందు చెరువులో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని, గంగపుత్రుల ఆశీర్వాదం కోసం ఈ బలిపూజ నిర్వహించటం ఆనవాయితీగా మారిందని వారు వెల్లడించారు.

ఈ ఉత్సవాన్ని బోధన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, అధ్యక్షులు, కార్యదర్శులు, డైరెక్టర్లు, కోట అబ్బయ్య, మాగిరి గంగాధర్, వెండి పోశెట్టి, తోపారం లింగం, తోకల పోశెట్టి, బొంతల సాయిలు, వెండి లక్ష్మణ్, వెండి నగేష్, వెండి దత్తు, దాల్ మల్కా సాయిలు, వెండి గంగారం, వెండి బాలయ్య తదితరులు సమిష్టిగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, యువతీ యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....











