Post Views: 94
మోస్రా / చందూర్, ఆగస్టు 3:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీరు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి దానసరి సీతక్క గారు నేడు మోస్రా మరియు చందూర్ మండలాల్లో నిర్మించిన కొత్త సమగ్ర కార్యాలయ సముదాయాలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు, బోధన్ ఉప కలెక్టర్ గారు, పలువురు ఉన్నతాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సముదాయాల ప్రారంభం ద్వారా మండల స్థాయిలో ప్రజలకు అవసరమైన పలు శాఖల సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడం జరిగిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్థానిక పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇవి బలమైన వేదికలుగా నిలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు భారీగా పాల్గొని విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








