V1News Telangana

best news portal development company in india

రైతులందరూ ఆర్థికంగా బలోపేతం చెందాలి….

SHARE:

 

 

– పీఎం కిసాన్ 20వ విడత ఆర్థిక సహాయం నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

 

– దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం పట్ల ప్రజల ప్రశంసలు

 

– బిజెపి ప్రభుత్వం రైతులను, అన్ని రంగాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని వర్ణన

 

– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

 

కామారెడ్డి ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో శనివారం రోజు AEO గ్రీష్మ ఆధ్వర్యంలో రైతులు, బిజెపి నాయకులు ,గ్రామస్తుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోజు వారణాసిలో పీఎం కిసాన్ 20 వ విడత రైతులకు ఆర్థిక సహాయం నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ శ్రద్ధగా వీక్షించారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేస్తుందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నుముక అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు దాదాపు 20 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ది అని తెలిపారు. రైతులందరూ పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగే విషయాలపట్ల జాగ్రత్త వహిస్తూ రైతులకు భీమా సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అనంతరం మిర్జాపూర్ క్లస్టర్ లో బదిలీపై విచ్చేసి నూతనంగా విధులు నిర్వహిస్తున్న AEO గ్రీష్మ ను బిజెపి నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రైతు వేదిక ప్రాంగణంలో పూల మొక్కలను కూడా నాటారు.ఈ కార్యక్రమంలో భారతీయజన తా పార్టీ మిర్జాపూర్ బూత్ అధ్యక్షులు సంతోష్, మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి గౌడ్, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, బల్వీర్ సింగ్, సాయిలు, లక్ష్మణ్, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india