Post Views: 140
రక్త, నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించిన రామగుండం మున్సిపల్ అధికారులు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఆగస్టు 02:-
వంద రోజుల కార్యాచరణలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆర్‌పీలకు రక్త, నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రసన్న కుమారి, ఆర్‌ఎంఓ దండె రాజు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవయవ దానంపై అపోహలు తొలగించాలన్నారు. శమతకమణి, విజయ్ లను సత్కరించారు. తల్లి పాల వారోత్సవాల ప్రచారం, గౌతమినగర్‌లో తడి–పొడి చెత్త వేరు చేసే అవగాహన, కొత్త ఇళ్ల కొలతల నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








