V1News Telangana

best news portal development company in india

“తల్లిపాలు వారోత్సవాలు”అవగాహన కార్యక్రమం ….

SHARE:

 

 

– “ముర్రుపాల” విశిష్టత గురించి మహిళలకు క్లుప్తంగా వివరణ

 

– రోగ నిరోధక శక్తిని పెంచి, జీర వ్యవస్థను మెరుగుపరిచి, వ్యాధుల బారి నుండి రక్షణ కల్పిస్తాయని పలు సూచనలు

 

– గర్భిణీ స్త్రీలు, బాలింతలు అధిక పోషకాలు కలిగిన, పౌష్టికాహారాన్ని భుజించాలి

 

– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని కామ్ షెట్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజు అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో “తల్లిపాలు వారోత్సవాలు”కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో గల బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి.. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాటించవలసిన ఆహార నియమాల గురించి క్లుప్తంగా వివరించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికరమైన, అధిక పోషకాలు లభించే ఆహారాన్ని భుజించాలని తెలిపారు. తద్వారా పుట్టబోయే బిడ్డలకు తల్లిపాలు పుష్కలంగా అందుతాయని సూచించారు. ముఖ్యంగా ప్రసవానంతరం తల్లులు తమ శిశువులకు జన్మించిన తరువాత మొదటి కొన్ని రోజులు తల్లి నుండి వచ్చే పాలను త్రాగించడం ముఖ్యమైన విషయమని అన్నారు. ముర్రు పాలు రోగ నిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధుల నుండి బిడ్డను కాపాడతాయని.. అలాగే, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండే విధంగా దోహదపడతాయని తెలిపారు. ముర్రుపాలలో ఉండే పోషకాలు, యాంటీబాడీ లు శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. మరియు భవిష్యత్తులో సంక్రమించే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల భారి నుండి రక్షణ కల్పిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని, అంగన్వాడి ఇంచార్జ్ టీచర్, ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india