బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులు అట్లాగే పటాన్చెరు నుండి బోధన్ గుండా అదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ ను మంజూరు చేసినందుకు, నవీపేట ,ఎడపల్లి ,బోధన్ పట్టణంలో ఆర్ఓబి ఫ్లైఓవర్లు మంజూరు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి , అట్లాగే మెడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, వడ్డి మోహన్ రెడ్డి గార్లకు బోధన్ నియోజకవర్గ బిజెపి పార్టీ తరఫున మరియు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అందరూ మాట్లాడుతూ ఎంపీ గారికి బోధన్ నియోజకవర్గం పై ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఇంకా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఆయనకు బోధన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చే రెండవ బిల్లు కొరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్ లో ఎంటర్ చేస్తేనే రెండో బిల్లు వస్తుందని, ప్రజలు దీనిని గమనించి ఇందిరమ్మ ఇండ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని గమనించగలరని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కానీ , అధికారులు గానీ ఈ బిల్లుల విషయంలో ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు . అట్లాగే బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు బోధన్ అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి లేక కుంటుపడుతున్న గ్రామాలలో డ్రైన్లు, సిసి రోడ్ నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేయాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి ,బోధన్ రూరల్ అధ్యక్షులు సిర్ప సుదర్శన్ ,ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, రెంజల్ మండల అధ్యక్షులు క్యాతం యోగేష్, సాలూరు మండల అధ్యక్షులు రావుబ గంగాధర్ , మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్ (చిన్న),నాయకులు వాసు, స్వప్నిల్ , బండారీ రవి, కృష్ణ, ఫణి పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








