V1News Telangana

best news portal development company in india

కామారెడ్డి జిల్లా ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ విఠల్, మాణిక్యం

SHARE:

తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపి, పిఎంపీల సేవలు గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం…

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి మరియు పి.ఎం.పి లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, వైద్యుల కొరత ఉన్న మారుమూల గ్రామాలలో నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ వీరి సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం,

కనీసం వీరిని గుర్తింపు లేకపోవడం, అనధికార వైద్యులుగా ముద్ర వేయడం వంటి వాటితో ఆర్.ఎం.పి పిఎంపి లు తీవ్ర ఆందోళన చెందుతున్నారనీ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేతి రాజేశ్వరరావు తమ ఆవేదన వ్యక్తం చేశారు…దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెడుతున్నామని, చిన్నపాటి జ్వరాలు, గాయాలు ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు తక్షణమే స్పందించి, వైద్యం అందిస్తున్నామని… అయినప్పటికీ తమరిని చట్టబద్ధమైన గుర్తింపు లభించడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు అన్నారు…ఇప్పుడున్న ప్రభుత్వం తమకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల, తరచుగా…వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీలకు, వేధింపులకు, గురవుతున్నామని,తమ క్లినిక్ లను సీజ్ చేయడం, తమపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో ఈ వ్యవస్థ భయాందోళనకు గురవుతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి బెజ్జంకి రవీందర్ తెలియజేశారు…తాము గ్రామీణ ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ, నేరస్తులుగా చూడటం పట్ల తాము తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆర్ఎంపీలు పీఎంపీలు తమ ఆవేదన వ్యక్తం చేశారు….చాలామంది ఆర్ఎంపి పిఎంపీలకు అధికారిక వైద్య డిగ్రీలు లేనప్పటికీ అనుభవంతో వైద్యం చేస్తున్నామని అయితే వీరి జ్ఞానాన్ని నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ స్థాయిలో సరైన శిక్షణా కార్యక్రమాలు లేవని ఆధునిక వైద్య పద్ధతులపై అవగాహన కల్పించకపోవడం వల్ల వీరి సేవలో పరిమితులు ఉన్నాయని రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మిట్టపల్లి రాజమౌళి అన్నారు….తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపి పీఎంపీల సంఘాలు ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేశాయని వీటిలో ముఖ్యంగా చట్టబద్ధమైన గుర్తింపు లభించడం క్రమబద్ధీకరిన నిరంతర శిక్షణ ప్రభుత్వ తరపు నుండి వేధింపు ఆపాలని సామాజిక భద్రత పథకాలను తమకు కూడా వర్తింపచేయాలని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హనుమంతరావు అన్నారు…వైద్య ఆరోగ్య రంగంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో ఆర్ఎంపి పిఎంపీల సేవలను విస్మరించడం సరికాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరికి సరైన శిక్షణ గుర్తింపు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపితం చేయవచ్చని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆర్ఎంపీ ఎంపీల సమస్యలపై దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి నూతనంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నిజ్జన విట్టల్ వేడుకున్నారు…

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india