V1News Telangana

best news portal development company in india

నంబర్ ప్లేట్ లేని ఇసుక ట్రాలీల దౌర్జన్యం..! ఇసుక దందా అదుపు తప్పింది – ప్రజలు ఆగ్రహ భరిత నిరసన ట్రాక్టర్లు. ట్రాలీ ఆటోల బెజవాబు రవాణా – అధికారులు మౌనమేనా? పట్టించుకోని అధికార యంత్రాంగం – ట్రాలీలకు చెక్ ఎప్పుడు?

SHARE:

వి1 న్యూస్, జూలై 23, సాలూర మండలం:ఇటీవలి కాలంలో మండలంలోని మందర్న గ్రామ పరిధిలో అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాపై గ్రామస్తుల ఆందోళన తీవ్రతరం అవుతోంది. నిన్నటికి నిన్న గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి ఇతర గ్రామాల నుండి వచ్చే ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. కానీ ఈరోజే తిరిగి నంబర్ ప్లేట్ లేకుండా, అనుమతులు లేకుండా. ట్రాక్టర్లు. ట్రాలీ ఆటోల్లో.పెద్ద మొత్తంలో ఇసుక రవాణా జోరందుకుంది…

 

oplus_8388608

 

గ్రామస్తులు చెబుతున్నదేమంటే, “ఇది ఎలాంటిది? ఒక్కరోజు ఆందోళన తర్వాతే తిరిగి మాఫియా రెచ్చిపోతోంది. ఎటు నుంచి వస్తున్నాయి ఈ వాహనాలు? ఎవరు అడ్డుకుంటారు?” అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బోధన్ పట్టణం, ఇతర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ట్రాలీ ఆటోలు ఇసుకను తరలిస్తున్నాయి. వీటికి నంబర్ ప్లేట్లు లేవు, బ్యాచ్ నంబర్లు లేవు, అనుమతులేదూ, బిల్లులేదూ. అభివృద్ధి పనుల పేరిట తక్కువ ధరకు తీయబడిన ఇసుకను, భారీగా విక్రయించడం ప్రజలకు కళ్లెదుటే జరుగుతోంది…

 

ఇది చూడనట్లు ఉన్న అధికారులు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “దీనికి కారణం, పక్కా లావాదేవీలేనా?” అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజూ ఉదయం నుంచి రాత్రివరకు. కొన్ని వాహనాలు. నిబంధనలు లేని విధంగా రవాణా కొనసాగుతున్నదని, ఇలాంటి అక్రమ రవాణాపై అధికారులు ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.

 

ప్రజల డిమాండ్: వెంటనే నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు. ట్రాలీలపై చెక్ పెట్టాలి, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు…

మరి అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి మరి… అధికారులు మౌనమేనా?

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india