V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశం….

SHARE:

– రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించే విధంగా సైనికుల్లా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం

– ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని పలు సూచనలు

– స్థానిక సంస్థలలో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కృషి చేయాలని ప్రతిజ్ఞ

– బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్

– బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు ఆధ్వర్యంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా విజయం సాధించి.. స్థానిక సంస్థలలో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటి, అల్లం రాములు, గంపల శంకర్, మోసీన్, లక్ష్మణ్, సాయిలు, రమేష్, రాజు, రేహాన్, గంగాధర్, సాయిబాబా, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india