– పండగలా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహణ
– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
– నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా నసరుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి ఆయన పేరిట పూజ,అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. పోచారం భాస్కర్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని.. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు పొందాలని భగవంతున్ని కోరుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మరియు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ఆవరణలో కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు ఆత్మీయంగా కేక్ ను తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్,మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, భాను ప్రకాష్ గౌడ్, ఖలీల్, సాయిలు, జగన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పోచారం భాస్కర్ రెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు, రక్తదానాలు, నిర్వహించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








