V1News Telangana

best news portal development company in india

ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ట్రాక్టర్ యజమానులు – సాలురలో నిరసన . ఇసుక రవాణాపై మండలాల మధ్య వివాదం – సాలురలో ట్రాఫిక్ జాం సాలురా చౌరస్తా వద్ద ట్రాక్టర్లతో నిరసన – అధికారుల జోక్యం . ఇసుక రవాణా అనుమతుల్లో అసమానతలు – తహసిల్దార్ హామీతో నిరసన విరమణ

SHARE:

సాలూర మండల వాహనాలకు మాత్రమే ఇసుక అనుమతి ఇవ్వాలని నిరసన..

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  ప్రభుత్వం ఇసుక డిడి రుసుము లేకుండానే అనుమతులను  ఇస్తుంది. సాలూర మండలంలోని తగ్గేలి, మందార్నా  గ్రామాలలోని మంజీరా నది నుండి గత వారం రోజులుగా  అనుమతులు ఇవ్వడంతో కేవలం పోతంగల్,బోధన్  ఎడపల్లి మండలాల వాహనాలకి అనుమతులు ఇస్తున్నారని సాలూర మండలానికి చెందిన ట్రాక్టర్ యజమానులు, లేబర్లు గత రెండు నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వందల వాహనాలతో రోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని సాలురా చౌరస్తా వద్ద నిరసన తెలిపి ఇసుక  ట్రాక్టర్లను నిలిపివేశారు. బోధన్ రూరల్ పోలీసులు, సాలూర  తహసిల్దార్ శశిభూషణ్ అక్కడ చేరుకొని  సాలుర మండల ట్రాక్టర్ యజమానులతో మాట్లాడి  వారి సమస్యలను ఉన్నతాధికారులకు వెల్లడించి  సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో  నిరసనకారులు ఆందోళన విరమించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india