V1News Telangana

best news portal development company in india

వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవార్లకు బోనాలు సమర్పణ….

SHARE:

– అందంగా అలంకరణతో కనువిందు చేసిన బోనాలు

– ఆటపాటలతో ఆనందోత్సాహల నడుమ గ్రామంలో ఊరేగింపు

– మొక్కులు చెల్లించుకుని అందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకోలు

– నసురుల్లాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవతలు పెద్ద పోచమ్మ , నల్ల పోచమ్మ అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బంధుమిత్రులను ఆహ్వానించుకుని నూతన వస్త్రాలను ధరించి బోనం కుండలను అందంగా అలంకరించి.. డప్పుల చప్పుల్లు, డీజే పాటలు, ఆటపాటలతో ఆనందోత్సాహల నడుమ ఊరేగింపుగా బయలుదేరి అమ్మవార్లకు బోనాలు, నైవేద్యం, ఓడి బియ్యం సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం చివరి వారంలో నసురుల్లాబాద్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవతలు పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు ఘనంగా బోనాలతో పండగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. ఈ బోనాల పండుగను అందరం ఐకమత్యంతో కలిసి మెలిసి ఆనందంగా జరుపుకుంటామని తెలిపారు. అమ్మవార్ల కృపాకటాక్షాలతో సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు సమృద్ధిగా పండి రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు శంకర్, మల్లేష్, కంది సాయిలు, మహేష్, వెంకటేష్, విట్టల్, నర్సింలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india