V1News Telangana

best news portal development company in india

కాలువలు కాదు… కబ్జాదారుల క్యాంపులు! – సాలురలో అధికారుల మౌనం పచ్చగడ్డి?! నిబంధనలపై బుల్డోజర్! – పంట కాలువలు నెత్తిన అక్రమాల యజమానులు? . ఎమ్మెల్యే పేరు కవచమా? – రైతుల కాలువలు కబ్జాకు బలి?? . “పార్టీ కోసం కష్టపడ్డాం… కబ్జాలు చేస్తాం!” – ఇదేనా ప్రజాస్వామ్యం? . కలువలపై కబ్జా రాజ్యం – మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం??

SHARE:

వి1 న్యూస్ – నిజామాబాద్ జిల్లా, సాలుర మండలం:-పంటల ఉనికి కోసం తవ్విన కాలువలు… ఇప్పుడు అక్రమ కట్టడాల గుట్టలుగా మారాయి!?‌
సాలుర మండలంలో పంటకాలువలు తక్షణమే కబ్జాదారుల దారిలో చిక్కాయి. కానీ అధికార యంత్రాంగం మాత్రం మౌన దీక్షలో ఉందంటే ఆశ్చర్యమే! పత్రికా ప్రకటనలకే పరిమితమవుతూ, కబ్జాదారులపై మాత్రం చర్యలలో నిష్క్రియత చూపుతుండడం దురదృష్టకరం.?
oplus_8388608
“పార్టీ కోసం పని చేశాం… ఇప్పుడు మాకే భూములు కావాలి” అని బహిరంగంగా చెప్పే స్థాయికి వారు చేరారు.?

ప్రశ్నించిన రైతులను బెదిరించడం, అధికారులను అణగదొక్కడం – ఈ కబ్జా మాఫియా ఓ సామ్రాజ్యంగా ఎదుగుతుంది.? ఇదే సమయంలో, ఎమ్మెల్యే పేరుని కలపిస్తూ శాసనాన్ని ఉల్లంఘిస్తున్న వారు మరింత ధైర్యంగా మారిపోతున్నారు.?

నిధులతో రైతుల పంట కాలువల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే, అధికారుల నిర్లక్ష్యం వల్ల అదే నిధులు వ్యర్థమవుతున్నాయి.?పలు గ్రామాల్లో ప్రశ్నించదగిన అభివృద్ధి కాదు – ప్రశ్నించాల్సిన అవినీతి కొనసాగుతోంది.“?

ఇది రైతు పాలన కాదు, ఇది కబ్జాదారుల పునాది!” అని రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.?

కబ్జాలకు స్వర్గధామంగా మారిన ఈ ప్రాంతంలో MLA గారి స్పందన లేకపోవడం… అధికారుల మౌనం… ప్రజల నమ్మకాన్ని తుడిచేసే ధోరణికే సూచిక!…?

🔴 ప్రజలకు పిలుపు:

ఈ దాడులపై మౌనంగా ఉండకండి. కాలువల్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి.సామూహికంగా సంతకాల ఉద్యమం మొదలెట్టండి. మీడియా, సోషల్ మీడియాలో విషయాన్ని విస్తృతంగా పంచండి. అధికారులపై RTIలతో ఒత్తిడి తెచ్చండి…..

 

“కబ్జాలు చేస్తాం… మేమే శాసనం!”

సాలురలో కాలువలు గల్లంతు – కబ్జాదారుల రాజ్యం

నోటీసులు లెక్కచేయని కబ్జాదారులు – అధికారులకి బెదిరింపులు

రైతు పాలన ఎక్కడ? కబ్జాల పాలన సాగుతోంది!

ఎమ్మెల్యే పేరు వాడుకొని ప్రజల్లో భయం పెంచుతున్న కబ్జాదారులు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india