V1News Telangana

best news portal development company in india

ఉదయం లీగల్ – రాత్రి ఇల్లీగల్! . బోధన్‌లో అధికార యంత్రాంగం అమ్ముడైందా? . సాలుర మండలం మార్గంగా అక్రమ ఇసుక రవాణా . ఫిర్యాదులకే న్యాయం లేదంటే – అధికారులపై అనుమానాలు జర్నలిజం కాగితం మీదే – మాఫియా గ్రౌండ్‌లో రాజ్యం . ప్రశ్నిస్తే బెదిరింపులా? ప్రజాస్వామ్యానికి భంగం ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్ – ప్రజల వినవిండి రద్దీ….

SHARE:

ఉదయం లీగల్… రాత్రి ఇల్లీగల్!”

– సాలుర నుంచి బోధన్ దాకా మాఫియాల ఊచకోత!

“ఇసుక మాఫియాకు పాలాభిషేకం – అధికారుల మౌనానికి ప్రగాఢ అర్థం?”

. “ఓ మాఫియా – శాఖలు మౌనం!”

రవాణా, మైనింగ్, అధికారులు ఎక్కడ?

. “పెర్మిషన్ ఒక్కటీ… రవాణా పది!”

నిబంధనల్ని తుడిచేసే అక్రమాల హవా

. “ప్రజల ప్రశ్నలకు బదులుగా బెదిరింపులా?”

బోధన్ ప్రాంతంలో ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం

 

సాలుర మండలం – బోధన్ పరిధి :

ఉదయం నిబంధనలు… రాత్రివేళ మాత్రం మాఫియాలకు స్వేచ్ఛ! ఇది కొత్త కథ కాదు – కానీ ఇప్పుడు మరింత బరితెగింపుతో, అధికార యంత్రాంగాన్ని బలుపుగా మారుస్తూ జరుగుతోందంటే… ప్రజలు చూస్తూ ఉండిపోతున్నారు.

 

ఇసుక మాఫియా కంటే అధికారి మౌనం ప్రమాదకరం అంటున్నారు స్థానికులు. ఎలక్షన్ ముందు హామీలతో సందడి చేసిన నేతలు – ఇప్పుడు అధికార గదుల్లో సెటిల్మెంట్లతోనే సంతృప్తి చెందుతున్నారు. పట్టుబడిన వాహనాలు సాయంత్రానికి రోడ్డు మీద తిరిగే స్థాయికి వచ్చేశాయంటే… ఇందులో దాగిన వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తడం సహజం.

 

టిప్పర్లు, ఆటోలు, ట్రాక్టర్లు నంబర్ ప్లేట్ల్లేని వాహనాలు.. ఒకే వెబిల్ పై ఎన్నిసార్లు ప్రయాణాలు? అధికారుల కనుసన్నల్లో జరిగే ఈ రవాణా వెనక బలమైన సహకారం ఉన్నట్లు కనిపిస్తోంది.

 

ఫిర్యాదు చేసినవారి గొంతుకలను కట్టివేయాలనే బెదిరింపులు… ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నార్ధకం వేస్తున్నాయి. ప్రజలు నిలదిస్తే వారే తలకిందులవుతారా? అనే ఆవేదన బోధన్ ప్రజల్లో ఉన్నది నిజం!

 

ఇప్పుడు ప్రశ్న ఇదే…

ఇసుక మాఫియా దూకుడు కొనసాగుతుంది…

మౌనంగా మంత్రులు, నిర్లక్ష్యంగా అధికారులు…

అంటే ప్రజలకు ధైర్యం చెప్పేది ఎవరూ లేరా?

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india