– (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఈ నెల 23 బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల బంద్ కు (AISF) (SFI) (AISB) (AIPSU) (PDSU) (AIFDS) వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు నిస్తునాయని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ప్రధాన సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,వాటిని పరిష్కరించడంలో విఫలమైందని వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.ఈ విషయంపై ప్రతిఘటనగా జూలై 23 న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు ప్రధానంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంశాలను ప్రస్తావించారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని,ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్, ఎంఇఓ పోస్టులను భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి నిధులు ఇవ్వాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని,అద్దె భవనాలలో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో ఆశాస్త్రీయంగా తీసుకువచ్చిన సమయపాలనను మార్చాలని,బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని,ఎన్ ఇ పి 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని (AISF) (SFI) (AISB) (AIPSU) (PDSU) (AIFDS) (PDSU) వామపక్ష విద్యార్థి సంఘాలు
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంగా పోరాడతామని,జూలై 23న విద్యాసంస్థల బంద్‌ను అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని విద్యార్థులను, యువతను,ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








