Post Views: 239
బోధన్, జూలై 20 :నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామంలో ఈరోజు తీజ్ పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా తీజ్ కార్యక్రమానికి అవసరమైన భద్రత ఏర్పాట్ల కోసం గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించి, SI గారిని ఆహ్వానించి ప్రత్యేక బందోబస్తు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
ప్రతి ఏడాది ఘనంగా జరిగే తీజ్ పండుగకు అనేక గ్రామాల నుండి భక్తులు హాజరయ్యే నేపధ్యంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో పోలీసుల సహకారం అవసరమవుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనిపై SI గారు హామీ ఇచ్చి, తేజ్ పండుగ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పోలీసు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.
గ్రామంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొని ఉంది. సాంప్రదాయ నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు……
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








