V1News Telangana

best news portal development company in india

ఆర్థిక అక్షరాస్యత,బ్యాంకు లావాదేవీల పట్ల ప్రజలకు అవగాహన సదస్సు…..

SHARE:

– బ్యాంకులలో ఉండే వివిధ పథకాలు, ఇన్సూరెన్స్ పాలసీ ల పై శిక్షణ

– సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు

– గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకింగ్ సమాచారం ఇవ్వకూడదని హెచ్చరికలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శనివారం రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ సహకారం తో SST NGO, Canara Bank వారి సౌజన్యంతో, బాన్సువాడ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారు ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పైన, బ్యాంకులలో ఉండే వివిధ రకాల పథకాలు, ఇన్సూరెన్స్ పథకాల పైన, (Pmsby, Jjby, Apy, Ssy) అలాగే సైబర్ మోసాల పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటిని నివారించడానికి పాటించవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో Pmsby, jjby ఇన్సూరెన్స్ లు కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో IKP CC సుజాత,కౌన్సిలర్స్ బాలకృష్ణ, పర్వయ్య, అనుదీప్, మరియు గ్రామ ప్రజలు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india