V1News Telangana

best news portal development company in india

పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ…..

SHARE:

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

నిజామాబాద్ జిల్లా: పొతంగల్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 42 మంది పేద విద్యార్థులకు మరియు పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల 34 మంది పేద విద్యార్థులకు శనివారం రోజు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు మాట్లాడుతూ కోనేరు శశాంక్ పేద ప్రజలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ భరోసానివ్వడం అందరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పర్యావరణ కమిటీ కో కన్వీనర్ మార్కెల్లి ప్రకాష్ పటేల్, బాన్సువాడ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ మల్లెపూల రాజా గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, బూత్ అధ్యక్షులు శంకర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రాజు పటేల్, మండల ప్రధాన కార్యదర్శి మక్కయ్య, ఓమన్న, సంజీవ్ కుమార్, సాయినాథ్, మేత్రి కిరణ్, ఉపాధ్యాయులు హన్మండ్లు, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ వనజ, కె. హన్మండ్లు, సి ఆర్ కే రమేష్, హనుమంతరావ్, శ్రీవాణి, శ్యాంసుందర్, గగన్ కుమార్, మౌనిక, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india